హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1.93 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాం

కోనసీమ: రాయవరం గ్రామంలో రూ.1.93 కోట్లతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శనివారం శంఖుస్థాపన జరిగింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న ఆసుపత్రికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజ చేశారు. ఆధునిక వసతులతో ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.