హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమకు కొత్త రూపు'

TPT: రాయలసీమ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ మురళీమోహన్ (చినబాబు) తెలిపారు. రామచంద్రాపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని అన్నారు. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్‌ఫ్రూట్ తదితర పంటల పరిశోధన, ఎగుమతులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.