హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం

ASR: కొయ్యూరు మండలం రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇంఛార్జ్ బాకూరు పాండురాజు దాడుల నుంచి రక్షించుకునే మెళకువలను బాలికలకు నేర్పించారు. మండలంలోని 9 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం పెంపొందించుకోవాలన్నారు