హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూతలపట్టు PHCలో ఆకస్మిక తనిఖీ

CTR: పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జోనల్ మలేరియా అధికారి డా. నిర్మల్ అలెగ్జాండర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి డా. ప్రియాంక పరిధిలో జ్వరాల పరిస్థితిపై ఆరా తీశారు. ఫీల్డ్ సిబ్బంది ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటించి డ్రై డే, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వర బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు.