హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న VRAల రిలే నిరాహార దీక్షలు

ATP: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 17 రోజులుగా గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 18 రోజుకు చేరాయి. వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.