VZM: ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు MLA కోళ్ళ లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, హెల్త్ కార్డులు వంటి ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు


