హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారత్ గెలుపుతో తిరుపతిలో సంబరాలు

TPT: ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంతో తిరుపతిలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు. భారత్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. భారత జట్టు అద్భుత ప్రదర్శనతో దేశానికి స్వర్ణ పతకం అందించడం గర్వకారణమని అభిమానులు పేర్కొన్నారు.