హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైకరం హైస్కూల్లో లీకేజ్‌తో వృధా అవుతున్న తాగునీరు

ELR: ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ హైస్కూల్లో తాగునీటి కుళాయిలు లీకేజ్ అయ్యి నీరు వృధాగా పోతుంది. పాఠశాలలోనే విద్యార్థులకు నీటిని పొదుపుగా వాడుకోవాలని చెబుతూ, అదే పాఠశాలలో నీరు వృధా కావడం విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కుళాయిల లీకేజీని మరమ్మతు చేయించి నీటి వృధాను అరికట్టాలని కోరుతున్నారు.