హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరియాపల్లి ఆనకట్టు పరిశీలన

ASR: అనంతగిరి మండలం సరియాపల్లి ఆనకట్టును జలవనరుల శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. హుదూద్ తుఫాన్‌లో దెబ్బతిన్న ఆనకట్టును పునర్నిర్మించేందుకు రూ.75 లక్షలు అవసరమని పాడేరు ఎస్ఎంఐ ఈఈ రాజేంద్రకుమార్ తెలిపారు. ఈ ఆనకట్టు ద్వారా 250 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.