VSP: గోపాలపట్నం, మర్రిపాలెం రైతు బజార్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్సిడీ ఉల్లి కౌంటర్లను ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసిన నాణ్యమైన ఉల్లిని కిలో రూ.35కే ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం విక్రేతలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యం'


