హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం దుకాణం ఏర్పాటును రద్దు చేయాలి'

GNTR: గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డు, చంద్రబాబు నాయుడు కాలనీ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొని స్థానికులకు సంఘీభావం తెలిపారు.