BPT: మార్టూరు మండలం ఇసుక దర్శిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ శనివారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేశారు. 60 ఏళ్లు పైబడిన వారు ప్రతి 3 నెలలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రోజూ పౌష్టికాహారం తీసుకుంటూ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇసుక దర్శిలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం


