హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

GDCC బ్రాంచ్‌లపై సమీక్షించిన ఛైర్మన్

PLD: ఉమ్మడి గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంకు 44 బ్రాంచ్‌ల మేనేజర్లతో వినుకొండ మాజీ ఎమ్మెల్యే, చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, సీఈఓ వీవీఎస్ ఫణికుమార్ సమీక్ష నిర్వహించారు. రైతులు, డ్వాక్రా సంఘాలకు విరివిగా రుణాలు అందించాలని చైర్మన్ సూచించారు. మొండి బకాయిల వసూళ్లు, డిపాజిట్ల పెంపుపై దృష్టి సారించి బ్యాంకు వ్యాపారాభివృద్ధికి కృషి చేయాలని సీఈఓ ఆదేశించారు.