హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం కాపు కళ్యాణ మండపంలో శనివారం కొత్తపేట ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ ఉత్సవ్, పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీమణి కమలారాణి, జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.