హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

SKLM: పోలాకి మండలం మబగాం గ్రామంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజల నుంచి తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.