హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెగిపోయిన కాలువను పరిశీలించిన కార్యకర్తలు

WNP: ఖిల్లా ఘనపూర్ మండలం కొత్వ వద్ద తెగిపోయిన నీటి కాలువను టీ. సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్ రైతులతో కలిసి పరిశీలించారు. కాలువ తెగిపోవడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా మరమ్మతులు చేపట్టి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.