హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష!

కర్నూలు జిల్లా పరిషత్ అభివృద్ధి పనులపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. జడ్పీ సీఈవో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పనుల పురోగతి, నిర్వహణ తీరుపై వివరాలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.