హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అడవితల్లి బాట పనులు పూర్తి చేయాలి'

ASR: అరకువేలి మండలం బిజ్జగూడ గ్రామానికి అడవితల్లి బాట రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎంపీటీసీ దశరథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు నిరసన ర్యాలీ నిర్వహించారు. 2024లో మంజూరైన రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో రాకపోకలకు, అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.