KRNL: మంత్రాలయం నుంచి మాధవరం వెళ్లే జాతీయ రహదారిపై రాగ సుధా లాడ్జి సమీపంలో శనివారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఓ నిర్మాణానికి ఎర్రమట్టిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ట్రాక్టర్ బోల్తా.. స్తంభించిన ట్రాఫిక్!


