హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలి'

చిత్తూరు కలెక్టరేట్‌లో శనివారం ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు పీడీకి వినతిపత్రం సమర్పించారు. కనీసం వేతనం రూ. 26వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పిచాలని, మ్యాన్‌డేస్ విధానం రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పించాలని, ఈనెల 5లోపు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రము మొత్తం సమ్మె చేస్తామని హెచ్చరించారు.