హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందమూరులో కార్మికుల సంక్షేమంపై సదస్సు

W.G: తాడేపల్లిగూడెం మండలం నందమూరులో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, సభ్యత్వ నమోదుపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ కోరారు. నమోదు విధానాన్ని వివరించిన ఈ కార్యక్రమంలో కోడే సాయి బాలాజీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.