KRNL: రూ.2.22 కోట్లు మోసం చేశారంటూ సురేశ్‌బాబు ఇంటి ముందు నాయకంటి సునీత చేపట్టిన ధర్నాకు మహిళా ఐక్యవేదిక మద్దతు తెలిపింది. షేర్ మార్కెట్ పేరుతో నమ్మించి సునీత దంపతులతో భారీగా అప్పులు చేయించారని అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి ఆరోపించారు. అప్పుల వారి వేధింపులు తాళలేక సునీత భర్త ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2.22 కోట్ల మోసం.. మహిళా ఐక్యవేదిక మద్దతు!


