హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

NDL: నంద్యాల జిల్లా కేంద్రంలో శనివారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కొనసాగించారు. రొమ్ము క్యాన్సర్‌ను మహిళలు ప్రారంభ దశలోనే గుర్తించి హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.