హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వామివారిని దర్శించుకున్న భారత క్రీడాకారుడు

కోనసీమ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ శనివారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం చేశారు.