హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని జంతువు దాడిలో మహిళ మృతి

KDP: గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లిలో చోటుచేసుకుంది. నారపు రెడ్డి బాలసుబ్బమ్మ (65), భర్త వెంకట కొండారెడ్డి, ఉదయం పొలం వద్దకు వెళ్లారు. చెరువు కట్ట కింద ఉన్న అరటి తోట సమీపంలో గుర్తుతెలియని జంతువు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాలసుబ్బమ్మకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో మృతి చెందింది.