హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు స్కూటర్లు పంపిణీ

PPM: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో శనివారం విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర స్కూటర్లను పంపిణీ చేశారు. ఈ వాహనాలు దివ్యాంగుల ఉపాధికి, వారి స్వయం సమృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.