హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెద్దమందడికి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలి'

WNP: పెద్దమందడి మండల కేంద్రానికి సరైన బస్సు సౌకర్యం లేక అమ్మపల్లి, మద్దిగట్ల, మోజర్ల గ్రామాల కళాశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. కళాశాల సమయాలకు అనుగుణంగా ఆయా గ్రామాల మీదుగా ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.