హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల శారీరక వికాసానికి క్రీడలు కీలకం'

KDP: జమ్మలమడుగులోని PR ప్రభుత్వ బాలుర పాఠశాలలో అండర్‌-14, అండర్‌-17 విభాగాల క్రీడా జట్ల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక వికాసం సాధ్యమని TDP జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి అన్నారు. ఎంపికైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు.