హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌పై నుంచి పడి మహిళకు గాయాలు

KDP: వేముల మండలం చాగలేరు గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు హాజరై బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా గంగమ్మ అదుపుతప్పి కిందపడడంతో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. గంగమ్మ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.