హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం : ఎస్పీ

కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. జనవరి 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనపై 31,361 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయకుండా, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు.