కృష్ణా: చల్లపల్లి రామానగరం సెంటర్‌లో కుక్కల దాడిలో కోటేశ్వరమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆమెను చల్లపల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి, కుక్కల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు


