హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మళ్లీ కరెంట్ కోతల రోజులు తెచ్చారు: హరీశ్ రావు

MDK: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతల రోజులను తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 24 గంటల విద్యుత్ సంగతి పక్కన పెడితే కనీసం ఆరు గంటలు కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఎల్‌నినోను సాకుగా చూపి ప్రభుత్వం తప్పించుకోవచ్చని, పంటలు ఎండుతున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.