హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రుపాలెంలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన

KMM: ఎర్రుపాలెం మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు ఆయన పీఏ ప్రకటన విడుదల చేశారు. ఎర్రుపాలెం, రామాపురం, రెమిడిచర్ల గ్రామాల్లో పర్యటించి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని మండల అధికారులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించి డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు.