ASR: ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. తాజాగా, కొత్తవీధి మండలానికి చెందిన గర్భిణి దామినిని కుటుంబ సభ్యులు 8 కిలోమీటర్లు డోలిలో మోసుకెళ్లారు. ఆధునిక కాలంలోనూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యం, రోడ్లు లేక డోలి మోతలు తప్పకపోవడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రాంతాల్లో రహదారి, వైద్య వసతులు కల్పించాలని వారు వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?


