హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.1.40 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కాకినాడ: ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామంలో కంబాలపాలెం–తిమ్మాపురం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శనివారం శంకుస్థాపన చేశారు. ఏపీఆర్ఆర్ఎస్పీ పీఆర్ఆర్ ప్లెయిన్ నిధులతో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.