తూ.గో: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆత్రేయపురం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను మంత్రికి వివరించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ వీఆర్ఏల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల సమస్యలపై మంత్రి కందుల దుర్గేష్‌కు వినతిపత్రం


