హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అపరిశుభ్రతకు నిలయంగా మారిన మందమర్రి బస్టాండ్

MNCL: మందమర్రి పట్టణ బస్టాండ్ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కూర్చునే కుర్చీల వద్ద చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రయాణికులు అసహనానికి గురై చెట్ల కిందకు వెళ్లాల్సి వస్తోంది. సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.