SRCL:నాంపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్ల ఏర్పాటు, ఇతర నిర్వహణ పనుల కారణంగా శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నాంపల్లి, శాలరామన్నపల్లి, కొడుముంజ, శభాష్‌పల్లి, చింతలటాన, నంది కమాన్, గుర్రంవానీపల్లి, మారుపాక, అగ్రహారం, చంద్రగిరి, తేట్టకుంట, చీర్లవంచ గ్రామాల ప్రజలు సహకరించాలని ఎన్పీడీసీఎల్ ఏఈ కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


