హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రులకు BRS జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం

GDWL: గద్వాల పట్టణంలోని రాంనగర్‌లో నిర్వహించనున్న శ్రీ మహాదుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడును రాంనగర్ యువజన సంఘం సభ్యులు ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ఆయన ఆర్థిక విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.