హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

MDK: శివ్వంపేట మండలం శభాష్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి స్కూటీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు చేగుంట మండలం చందాయిపేటకు చెందిన మహ్మద్ సమీర్(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.