సత్యసాయి: బత్తలపల్లికి చెందిన సతీష్ (23) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బేల్దారి పనులకు వెళ్లే సతీష్ మద్యానికి బానిసయ్యారు. పెళ్లి చేయాలని తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. పెళ్లి కాలేదన్న మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెళ్లి కాలేదని యువకుడు ఆత్మహత్య


