నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన కవిత (34) అదృశ్యమయ్యారు. మతిస్థిమితం సరిగా లేని ఆమె, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో సోదరుడు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
మహిళ అదృశ్యం.. కేసు నమోదు!


