హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కోసం రైతుల ధర్నా

KMR: శాంతాపూర్, సీతారాంపల్లి, మానాపూర్, రాజాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాకు సమయపాలన లేకపోవడంతో బోర్లు తరచూ పాడవుతున్నాయని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం శాంతాపూర్–సీతారాంపల్లి రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.