KDP: మైదుకూరు అర్బన్ సీఐగా డీ. హాజీవలి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలపై సమీక్షించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరు అర్బన్ సీఐగా హాజీవలి బాధ్యతలు


