PLD: ఈపూరు మండలానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం కుటుంబ సభ్యుడు ఆమెను ద్విచక్రవాహనంపై కళాశాల వద్ద దించి వెళ్లారు. సాయంత్రం అయినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణుగోపాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు


