హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఆస్తి నష్టం

GDWL: ఐజ మండలం చిన్న తాండ్రపాడు బస్టాండ్ సమీపంలో కుమ్మరి వెంకటన్నకు చెందిన కిరాణా బంకులో అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.