హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో సౌండ్‌ హారన్లపై ప్రత్యేక డ్రైవ్‌

KRNL: కర్నూలు ట్రాఫిక్ సీఐ మనసురుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని చల్లా కాంపౌండ్ పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 50 ఆటోల సౌండ్ హారన్లను పోలీసులు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్, మోటారు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.