హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మామను హత్య చేసిన అల్లుడు

KDP: లింగాల (M) మురారిచింతలలో శుక్రవారం రాత్రి హత్య జరిగింది. అల్లుడి వేధింపులు భరించలేక వారం క్రితం కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చిన అంకే రాజబాబు ఇంటికి అల్లుడు వచ్చి గొడవకు దిగాడు. ఉదయం మాట్లాడదామని చెప్పడంతో ఆగ్రహించిన అల్లుడు రాజబాబుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజబాబును పులివెందుల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.