హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మడికి నర్సరీ హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

కోనసీమ: ఆలమూరు మండలం మడికి నర్సరీలో మింగి రమేష్‌ (24) హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భర్తపై అనుమానంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ టీ. నరేష్‌, పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.