హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల ఎదుట చెత్తపై చేనేతపురి వాసుల ఆందోళన

BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ చేనేతపురిలోని పాఠశాల ఎదుట చెత్త పేరుకుపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త దుర్వాసనతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త వేయడానికి ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని గుర్తించి,మెరుగుపరచాలని కోరుతున్నారు.